అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జూలై 20 : విధి నిర్వహణలో ఉన్న సమయంలో విద్యుదాఘాతానికి గురై లైన్‌మెన్ ఒకరు దుర్మరణం పాలయ్యారు. అల్లూరిజిల్లా, డుంబ్రిగుడ మండలం, కొర్రయి పంచాయతీ పరిధిలోని జాముగూడ గ్రామానికి చెందిన కిండంగి ప్రహ్లాద్ (ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్) విశాఖపట్నంలోని మార్రిపాలెంలో విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం (జూలై 19) విధి నిర్వహణలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే సహచరులు స్పందించినా, అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు, పోలీసు వారు విచారణ ప్రారంభించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


