అల్లూరిజిల్లా పాడేరు త్రినేత్రం న్యూస్ ఆగస్టు 21 : రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి, జానపద కళలపై డాక్టరేట్ చేసిన తరపట్ల సత్యనారాయణను జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ పాడేరు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి వంపూరు గంగులయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గంగులయ్య మాట్లాడుతూ, “మీ వంటి పండితుల సలహాలు మాకు ఎంతో అవసరం” అన్నారు. స్పందించిన డా. సత్యనారాయణ, జానపద కళల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గౌరవచైర్మన్ గంగులయ్యను దుశ్శాలువ కప్పి సన్మానించి, తన పరిశోధనా గ్రంథాలను బహూకరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


