WhatsApp Image 2024 08 06 at 16.29.14
Let’s work hard to achieve Jayashankar’s ambitions
Trinethram News : వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
స్వర్గీయ జయశంకర్ కన్నకల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం.. అలాంటి మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తూ.. జయశంకర్ ఆశయాలను నెరవేర్చేలా మనందరం కృషి చేయాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ఈరోజు జయశంకర్ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి చైర్ పర్సన్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ జాకీర్ అహ్మద్, వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
