TRINETHRAM NEWS

అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.ఏప్రియల్ 14 నుంచి 20 వ తేదీ వరకు అగ్ని మాపక వారోత్సవాలు

  • ఫైర్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్*

Trinethram News : రాజమహేంద్రవరం : బాంబే డాక్ యార్డులో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన అగ్నిమాపక బ్రిగేడియర్స్  సంస్మరణార్ధం  అగ్ని మాపక వారోత్సవాలను ప్రతి ఏటా ఏప్రియల్ 14 వ తేదీ నుంచి నిర్వహించు కుంటున్నామని రాష్ట్ర అగ్నిమాపక డైరెక్టర్ జెనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పేర్కొన్నారు.

సోమవారం ఉదయం స్థానిక ఇన్నిస్ పేట లోనీ అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ప్రజల్లో అవగాహన కల్పించే క్రమంలో స్థానిక అగ్నిమాపక కార్యాలయంలో  అగ్నిమాపక వారోత్సవాలను జండా ఊపి ఆయన ప్రారంభించారు. తొలుత బిఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాలు నివారించేందుకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముఖ్య లక్ష్యం అగ్నిప్రమాద రహిత సురక్షిత భారతదేశానికి ఐక్యమవ్వడం అని , అందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అగ్ని ప్రమాదాలకి కారకాలు, అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సిన విధి విధానాలలో వంట ఇంట్లో గాలి వెలుతురు ఉండేటట్లు చూసుకోవడం, అగ్ని ప్రమాదం గమనించిన వెంటనే ప్రతి ఒక్కరూ ఆయా ప్రదేశాల నుంచి ఆరుబయట సురక్షిత ప్రాంతమునకు వెళ్లాలన్నారు. విద్యుత్ వలన అగ్రి ప్రమాదాలు జరగకుండా తగు నివారణ చర్యలు ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే నివారణ చర్యలు తీసుకోవడం కోసం, రాష్ట్ర వ్యాప్తంగా 160 అగ్రిమాపక వాహనాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్ర వరం రూరల్, దేవరపల్లి లలో ఫైర్ స్టేషన్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అగ్ని ప్రమాదాల వల్ల  ఇప్పటివరకు రూ.9 కోట్ల 28 లక్షల ఆస్తి నష్టం జరిగిందని, రూ.38 కోట్ల 28 లక్షల రూపాయలు అగ్నిమాపక సిబ్బంది ద్వారా ఆస్తులు కాపా డటం జరిగిందని తెలిపారు.  అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్న  7 మంది ప్రాణాలను కాపాడ డం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఇ.స్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.250 కోట్లు మంజూరు చేసిందని, మొదటి విడతగా రూ.153 కోట్లు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. 25 ఫైర్ స్టేషన్ లో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. పా ఠశాలలో ఆసుపత్రిలో వాణిజ్య సముదా యాల్లో అగ్ని ప్రమా దాలు జరగ కుండా అరికట్టేం దుకు సరిపడా నీటిని, ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఇన్ స్టలేషన్ నిబం ధనల మేరకు ఎల్ల ప్పుడూ సి ద్ధంగా ఉంచు కోవాలని తెలి పారు. గోదాము లు, గ్రామీణ ప్రాంతాలలో, కర్మాగారాలలో గిడ్డంగులలో అగ్ని ప్రమాదాలు నివారించేం దుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా మని తెలి పారు. తాత్కాలిక నిర్మాణాలు పందిళ్ళలో అగ్ని నిరోధక స్వభావం గల వస్తువులతోనే పండాళ్ళు నిర్మించుకోవాలని తెలిపారు. ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు ఏప్రియల్ 14 నుంచి 20 వ తేదీ వరకు అగ్ని మాపక వారోత్సవాలు నిరాహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తు స్పందన మరియు అగ్ని మాపక అధికారి ఎమ్ . మార్టిన్ లూథర్ కింగ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి పేరూరి శ్రీనివాస్, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

fire-free and safe India