TDP : పాడేరు టిడిపి లో ఎన్నడూ లేని సంస్కృతిని విననాడి సమైక్య భావనతో ముందుకి వెళదాం..!

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) నియోజకవర్గఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు.ముఖ్య ఉద్దేశం మండల బాడీ ఎన్నిక మండల కేంద్రంలో కార్యకర్తల సమీక్షంలో నిర్వహించాలి. ప్రతిపాదన 33 పంచాయతీల గ్రామ కమిటీ ఎన్నిక జరిగినట్టే పెండింగ్ లో ఉన్న పంచాయతీలు కూడా జరిపించి మండల కమిటీ ఎన్నిక కూడా మండల కేంద్రంలో జరగాలని, పార్టీ అబ్జర్వేటర్లకు విన్నవించుకుంటున్నట్లు కొయ్యూరు టిడిపి నాయకులు కార్యకర్తలు తెలియజేశారు. నాయకులు గతంలో ఎన్నడు లేని సంస్కృతి పక్కనపెట్టి మండల కేంద్రంలో లో జరగాలన్నదే ముఖ్య ఉద్దేశం. పార్టీ షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరగాలని అందరూ ఏకస్తులై తీర్మానం చేసినట్లు తెలియజేశారు .

అలాగునే రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరు కలిసి కట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ గొలసింగి సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుచ్చరి చిట్టిబాబు, మాజీ జెడ్పిటిసి గాడి శ్రీరామ్ మూర్తి, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు లోత భీమరాజు, అనిశెట్టి చిరంజీవి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కొర్రు రామ్మూర్తి, మాజీ ఎంపీటీసీ శివరామరాజు, కాకూరు చందర్రావు, పాగి రాజు, శ్రీరాములు సాంబశివ, గోవిందు, రమాదేవి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let's move forward with

You cannot copy content of this page

Scroll to Top