Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

దేవరకొండ జులై 10 త్రినేత్రం న్యూస్. దేవరకొండనియోజకవర్గంలోని తాటికోల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎం ఎల్ ఏ బలు నాయక్ భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని విధంగా రైతన్నల సంక్షేమం కోసం 9 రోజుల్లో 9 వేల కోట్లు పెట్టుబడి సాయాన్ని అందించింది మన ప్రజా ప్రభుత్వం అని పేర్కొన్నారు.

పేద ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి.. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఆశీర్వాదం మరింత ప్రోత్సాహాన్నిస్తుంది అని తెలిపారు.
గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు మౌళిక వసతులు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నాం అని అన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, NSUI నాయకులు,వివిధ హోదాల్లో ఉన్న నాయకులు,అధికారులు, లల్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA performs Bhoomi Puja

You cannot copy content of this page

Scroll to Top