ఈదునూరి రామకృష్ణ. ప్రధాన కార్యదర్శి GLBKS ఐ ఎఫ్ టు యు రామగుండం రీజియన్.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నాలుగు లేబర్ కోడుల రద్దు. ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణకై దేశ వ్యాప్తంగా జూలై 9న జరిగే అఖిల భారత సమ్మె విజయవంతం ను చేయాలని జీ ఎల్ బి కే ఎస్ (ఐ ఎఫ్ టీ యు) పిలుపునిస్తోంది. గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం ఐఎఫ్టియు రామగుండం రీజియన్ సమావేశం తేది:29-06- 2025.రోజు న గోదావరిఖని ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఐ ఎఫ్ టీ యు) రామగుండం రీజియన్ ప్రధాన కార్యదర్శి ఈదునూరి రామకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే సమ్మెలో సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్మిక చట్టాల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ. కనీస వేతనాల పెంపు. ఉద్యోగ భద్రత. ఉపాధి హక్కుల సాధనకై దేశ రక్షణకై. జరుగుతున్న సార్వత్రిక సమ్మె అన్నారు. మోడీ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రవేటి కరణ నిలిపివేయాలని, బొగ్గు ఆధారిత పరిశ్రమలను నెలకొల్పాలని, ఉపాధి అవకాశాలను కల్పించాలని, 8.గంటల పని దినాన్ని పరిరక్షించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26.000/- ఇవ్వాలని తదితర చట్టబద్ధ హక్కులు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు జులై 9న జరిగే సమ్మెలో పాల్గొనీ విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో గోదావరి లోయ బొగ్గు గాని కార్మిక సంఘం ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షు లు ఈ నరేష్, కార్యదర్శి గుండేటి మల్లేశం, రామగుండం రీజియన్ నాయకులు ఐ రాజేశం, ఎస్ ప్రసాద్, చింతల శేఖర్, ఎం కొమరయ్య, ప్రభాకర్, ఎన్ సి బాబు, పి మొండయ్య, ఎడ్ల రవికుమార్.తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


