నారి ఐలయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు
దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 08 త్రినేత్రం న్యూస్. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించే సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య కోరారు. ఆదివారం రోజున దేవరకొండ పట్టణ కేంద్రంలో 08వ వార్డు, 18 వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా జీవితానికి ఓట్లకు విడదీయరాన్ని సంబంధం ఉందన్నారు ప్రజల బతుకులు మారాలన్న పేదలకు ఇండ్లు రావాలన్న పిల్లల చదువులు బాగుపడాలన్న ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరగాలంటే ఒకటే ఒక మార్గం అది సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించే మార్గంగా ఓటర్ మహాశయులు ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు.
అదేవిధంగా నిత్యం ప్రజల కోసం ప్రజాలే సర్వసంగ భావిస్తున్న ఎర్రజెండా అభ్యర్థులను గెలిపిస్తే ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా పోరాడుతారని అన్నారు. డబ్బులు ఇచ్చి అధికారంలో వచ్చి పదవులను సంపాదించి రాజకీయాలను పదవులను వ్యాపారంగా మార్చి ప్రజలను మోసగిస్తున్నారనీ అన్నారు. .
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్, సిపిఎం పార్టీ దేవరకొండ మండల కార్యదర్శి నల్లా వెంకటయ్య, కౌన్సిలర్ అభ్యర్థులు బిజిలి లింగయ్య,పాతనబోయిన జ్యోతి, సిపిఎం పార్టీ నాయకులు ఓ. యాదగిరి, పర్వత రెడ్డి, కావలి కృష్ణయ్య,బుడిగ వెంకటేష్,ఎండి రహీం, శ్రీహర్ష, తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


