MLA Kavya Krishna Reddy : ఆరోగ్యకరమైన కావలికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 8: నెల్లూరు జిల్లా ‘ కావలి: ఆరోగ్యకరమైన కావలికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి క్యాన్సర్ స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలు పెంచుతాం కావలి మనది, మనమే బాగు చేసుకోవాలి కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ,వెల్లడి కావలి పట్టణంలో ఘనంగా క్యాన్సర్ అవగాహన ర్యాలీ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యకరమైన కావలిని తయారు చేయడం మనందరి సామూహిక బాధ్యతని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, టీమ్ సేవియర్స్, రోటరీ క్లబ్, నలంద స్కూల్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం క్యాన్సర్ అవగాహన ర్యాలీ 3కే వాక్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కావలి ఆర్డీఓ కార్యాలయం నుంచి శాప్ గ్రౌండ్ (మినీ స్టేడియం) వరకు కొనసాగింది.

ఈ అవగాహన ర్యాలీలో ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొని ప్రజలతో కలిసి 3కే వాక్‌లో అడుగులు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులపై ముందస్తు అవగాహన, స్క్రీనింగ్ టెస్టులు అత్యంత అవసరమని తెలిపారు.

మత్తు పదార్థాల వినియోగం, ముఖ్యంగా గంజాయి, కొన్ని రకాల టాబ్లెట్ల దుర్వినియోగం ప్రమాదకరంగా మారి, క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయని అన్నారు. కావలిలో ఎక్కడైనా గంజాయి అమ్మకం లేదా వినియోగం జరిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Everyone is responsible for a healthy lifestyle

You cannot copy content of this page

Scroll to Top