( గ్రామసభ (2025-26). మన వూరిలో ప్రభుత్వ బడి వుండగా ప్రైవేట్ బడి ఎందుకు దండగా
ప్రభుత్వ బడిలో ఉచితంగా పాఠ్య పుస్తకాలు ,నోట్ బుక్కులు, మధ్యహానభోజనం.స్కూల్ డ్రెస్, ప్రభుత్వం అందచేస్తోంది. ప్రభుత్వ బడిలో కార్పొరేట్ బడులకు ధీటుగా వసతులు. ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థి మరొక కొత్త విద్యార్థి చేరే విధంగా కృషి చేయాలి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపి రెడ్డి.
డిండి (గుండ్లపల్లి ) జూన్ 06 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోనీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం జూన్ 06 న బడిబాట కార్యక్రమం లో భాగంగా గ్రామసభ 2025-26 నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యులు పాపిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ బడులలో అన్నివసతులను కల్పిస్తుంది కాబట్టి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వ బడిలోనే చదివించండి.
ప్రభుత్వ బడులలో కార్పొరేట్ బడులకు దీటుగా ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందని, ప్రభుత్వ బడులలో చదివితే స్కిల్స్ అభివృద్ధి చెందుతాయని అందరి సహకారంతో మన ఊరు మనబడి ని అభివృద్ధి చెందడానికి గ్రామ ప్రజలు తల్లిదండ్రులు నాయకులు మీరందరూ కృషి చేస్తారని కోరారు.
ప్రభుత్వ బడులలో చదివిన వారే అత్యున్నత పదవులలో ఉద్యోగాలలో స్థిరపడి ఉన్నారని అన్నారు.
కార్పొరేట్ బడులలో లక్షలకు లక్షలు ఫీజులు పోసి వాళ్ళ డాం బాచారానికి ఆకర్షితులై చేర్పిస్తున్నారు తప్ప అక్కడ చదువు ఏమీ ఉండదని ప్రభుత్వ బడులలోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధన చేస్తారని, సమాజంలో అంతరాలు లేని విద్య ఏర్పడాలంటే పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చదవడం ద్వారా అది సాధ్యపడుతుందని ఆయన అన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రభుత్వబడులలో విద్యార్థులను చేర్చి ప్రభుత్వ బడులు అభివృద్ధి చెందేందుకు దోహదపడాలని ఆయన కోరారు. Each one catch one అనే నినాదంతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొంతమంది ప్రభుత్వ బడిలో పిల్లలను చదివిస్తే నామోషిగా ఫీల్ అవుతున్నారని, విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న, ఉన్నతమైన స్థానాలలో ఉండాలని, ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఉద్యోగులుగా స్థిరపడాలన్న ప్రభుత్వ బడులే దోహదపడతాయని అందుకే మీరు మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలను (విద్యార్థులను) ప్రభుత్వ బడులలో చేర్పించి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని, మరియు ప్రభుత్వ బడులు మూతపడకుండా మీ శ్వాసక్తుల కృషి చేస్తారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను విద్యార్థుల తల్లిదండ్రులను సమబాన సంఘం వాళ్ళని, ఆశా వర్కర్లను, ఉపాధ్యాయులను కోరారు.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంధ మల్ల రామారావు మాట్లాడుతూ బడుగు బలహీన పేద విద్యార్థులకు లకు కార్పొరేట్ విద్య అందరి ద్రాక్షగా మారింది అని , లక్షలు ఫీజులు పోసి అక్షరాలను కొనుక్కుంటున్నామని, ప్రవేట్ బడులలో డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చదువులకు కాదని, వాళ్ల ఆర్భాటాలను చూసి మోసపోవద్దని, ప్రభుత్వం ప్రభుత్వ బడులలో అన్ని సకల సౌకర్యాలను నాణ్యమైన విద్యను అందిస్తుందని అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన చేస్తారని సమాజంలో గౌరవం అత్యున్నత హోదా ఉద్యోగాలు రావాలన్నా మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి చదివించాలని మీ పిల్లల భవిష్యత్తుకు బంగారబాటలు వేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులను కోరారు. మరియు మిగతా ఉపాధ్యాయులు తమ విలువైన సమాచారాన్ని అనుభవాలను అందరితో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపిరెడ్డి, మండల పరిష త్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామారావు, గ్రామ పంచాయతీ సెక్రటరీ అంజయ్య, సీనియర్ సలహాదారులు ( ఉపాధ్యాయులు) శేఖర్ రెడ్డి, తిరుపతయ్య, సత్యనారాయణ, ఎం , సుజాత, కే ధనమ్మ, బుజ్జి రాణి, షాహిన్ ,రహమతుల్లా, సందీప్, ఆంజనేయులు, ఏటి కృష్ణ, లింగమయ్య, మహమ్మద్ జహంగీర్, గుర్రం సురేష్, బల్ముల ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


