Mon. Mar 9th, 2026

Damodar Sanjeevaiah Jayanti : స్వర్గీయ దామోదర్ సంజీవయ్య జయంతి — ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ సమావేశం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్… స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రివర్యులు దామోదర్ సంజీవయ్య జయంతి సందర్భంగా విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ జరిగింన ఈ కార్యక్రమానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పిట్టా వర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — దామోదర్ సంజీవయ్య సామాజిక న్యాయ సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా తొలి దళిత ముఖ్యమంత్రిగా పని చేశారని గుర్తుచేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాల క్షీణత కారణంగా ఉపాధి అవకాశాలు ప్రధానంగా ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయని, అయితే అక్కడ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల దళితులు, గిరిజనులు, బీసీలు ఆర్థికంగా వెనుకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రత్యేక చట్టం చేసి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంజీవయ్య ఆశయాలకు నిజమైన నివాళి అర్పించాలంటే రాజ్యాంగబద్ధ హక్కులను ప్రతి రంగంలో అమలు చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడలి సత్యమూర్తి, రాష్ట్ర ఐటీ సెల్ ఇంచార్జ్ డి మణికంఠ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎస్ వి లక్ష్మణరావు సామాజిక సంస్థల ప్రతినిధులు, యువజనులు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన భరతనాట్య కార్యక్రమంలో పాల్గొన్న కళాకారును దుస్సాల్వాతో సత్కరించారు

డా. పిట్టా వర ప్రసాద్
రాష్ట్ర అధ్యక్షులు
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్)**

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Late Damodar Sanjeevaiah Jayanti

Related Post

You cannot copy content of this page