CPI : ఉగ్రవాద శిబిరాలపై త్రివిధ దళాల మెరుపు దాడి అమోఘం

TRINETHRAM NEWS

మావోయిస్టుల సమస్యను రాజకీయ అంశంగా గుర్తించండి
వెంటనే చర్చలకు పిలవండి

మరోసారి రాజధానికి కేంద్రం మొండి చెయ్యి

ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చలి

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ డిమాండ్
Trinethram News : రాజమండ్రి మే 9: మే 7వ తేదీ అర్ధరాత్రి త్రివిధ దళాల ఆధ్వర్యంలో భారత సైనికులు పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించి సుమారు 100 మంది ఉగ్రవాదుల్ని అంతం చేయడాన్ని సిపిఐ అభినందిస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పేర్కొన్నారు శుక్రవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 22వ తేదీన 26 మంది అమాయక పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపినటువంటి హేయమైన చర్యకి దీటుగా భారత ప్రభుత్వం మిలటరీ ద్వారా ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారని ఆమె అన్నారు
ఈ ఆపరేషన్ కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే జరిగిందని ఏ విధమైనటువంటి పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద గాని పౌరుల మీద గాని జరగలేదని పేర్కొన్నారు యుద్ధం అనేది ఎప్పటికీ మంచిది కాదని యుద్ధం జరిగితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ , అమాయక ప్రజల ప్రాణనష్టం జరుగుతుందని చరిత్రలో యుద్ధాలు జరిగిన తర్వాత ఆ దేశం కోలుకున్నట్టు ఎక్కడా లేదని ఆమె అన్నారు
ప్రపంచ చరిత్రలో రాజధాని ప్రారంభించిన తర్వాత మళ్లీ పున: ప్రారంభించడం ఎక్కడా చూడలేదని ఆ ఘనత మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కే ఆ ఘనత దక్కుతుందని ఆమె ఎద్దేవా చేశారు ఈ పున:ప్రారంభంలో కూడా ఐదు కోట్ల ప్రజలు టీవీలకి అతుక్కుపోయి రాజధాని కి పోలవారానికి నిధులు ప్రకటిస్తారని ఎదురు చూశారని కానీ ఒక చాక్లెట్ మాత్రమే పవన్ కళ్యాణ్ ఇచ్చి వెళ్లిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అప్పులు ఇప్పించడం గొప్పగా చెప్పుకుంటున్నారని ఆ అప్పు మళ్లీ ప్రజలే తీర్చాలని ఆ అప్పుల భారాలని ప్రజల మీదే పడతాయని అలా కాకుండా విభజన హామీల్లో భాగంగా రాజధాని నిర్మాణానికి కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆమె తెలిపారు పోలవరం నిర్వహితుల సమస్యలని పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో 44000 వేల ఎకరాల అమరావతి రాజధాని నిర్మాణం కొరకు తీసుకోవడం అనేది సరైనది కాదు అని ప్రభుత్వం ఎటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి లేదు ఇవన్నీ కూడా ప్రజల మీద భారం పడుతుందని ఆమె అన్నారు విద్యుత్తు చార్జీలు పెంపు పట్ల ప్రభుత్వము రాయితీ విధానాన్ని తీసుకురాటం లేదని చెకి ఒప్పందాన్ని రద్దు చేయడంలో అనాసతితో ఉన్నారని ఆమె దుజమెత్తారు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తాస్టారాం చేస్తున్నారని నిధులు కొరత వెంటాడుతుందని చెప్తున్నారు గతంలో రాష్ట్రం అప్పులు తెలిసి అలవి కాని హామీలు ఇచ్చి ఇప్పుడు ఈ రకంగా మాట్లాడడం రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడుకి తగదని ఆమె అన్నారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు
దండకారణ్యంలో ప్రాంతంలో జరుగుతున్నటువంటి కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని అమాయక ఆదివాసుల మావోయిస్టుల అణచివేత పేరుతో అక్కడ ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి మరణహోమం పట్ల ఆందోళన వెల్లుబుచ్చారు మావోయిస్టు సమస్యని రాజకీయ సమస్యగా గుర్తించి పరిష్కరించాలని ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకుని తక్షణమే ఈ ఆపరేషన్ ఆపివేయాలని ఆమె అన్నారు

ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు, రేఖ భాస్కరరావు, కార్యవర్గ సభ్యులు వి కొండలరావు, పి లావణ్య, పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lightning strike by three

You cannot copy content of this page

Scroll to Top