అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, పార్లమెంటు సభ్యురాలు తనూజ రాణి ఆవిష్కరణ.
అల్లూరిజిల్లా (పాడేరు) త్రినేత్రంన్యూస్ మే 17: ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ (యూజెఎఫ్) ఆధ్వర్యంలో సిద్ధం చేసిన ఆరు జిల్లాల జర్నలిస్టుల ఫోన్ నెంబర్లు మరియు సమాచారంతో కూడిన హ్యాండ్‌బుక్ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ఇది సమాచార వ్యవస్థను మరింత బలంగా తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. సమగ్రంగా అందుబాటులో ఉండే జర్నలిస్టుల వివరాలు ప్రజలకు, అధికారులకు కూడా సాయం చేస్తాయి” అన్నారు.
ఈ కార్యక్రమంలో యూజేఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్షులు మరియు ఏపియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కే. రాము పాల్గొని, యూజేఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.ఆర్.ఎన్. వర్మ నాయకత్వంలో చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు.
అంతకుముందు, పార్లమెంటు సభ్యురాలు గుమ్మా తనూజ రాణి కూడా హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీపీఆర్‌ఓ గోవిందరాజులు, యూజేఎఫ్ కోఆర్డినేటర్ హరనాథ్, జిల్లా ప్రతినిధి సూర్యారావు, చింతపల్లి ప్రతినిధులు ఆనందరాజు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


