MLA Kavya Krishna Reddy : జర్నలిస్ట్ డా. పాదర్తి నాగరాజును పరామర్శించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: జనవరి 23: నెల్లూరు జిల్లా: కావలి .. ఇటీవల నెల్లూరు కిమ్స్ హాస్పిటల్‌లో గుండెకు స్టెంట్ వేయించుకుని చికిత్స పొందిన అనంతరం, కావలి పట్టణంలోని పుల్లా రెడ్డినగర్, శ్రీ నిలయం అపార్ట్మెంట్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జర్నలిస్ట్ డా. పాదర్తి నాగరాజును కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , పాదర్తి నాగరాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని, పూర్తిగా కోలుకుని త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వచ్చి తన సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు.డా. పాదర్తి నాగరాజు జర్నలిజం రంగంలో, సమాజ సేవలో చేసిన కృషి అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యతాయుతమైన జర్నలిస్టులు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు.ఈ పరామర్శకు డా. పాదర్తి నాగరాజు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడుతోందని,త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుంటానని డా. పాదర్తి నాగరాజు తెలిపారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kavali MLA Kavya Krishna Reddy visits Journalist Dr. Padarthi Nagaraju

You cannot copy content of this page

Scroll to Top