MLA Participated AP Assembly : ఏ.పీ .అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 12: నెల్లూరు జిల్లా: కావలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం..
ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ , ప్రసంగించారు.రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యంగా ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించబడుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , స్పందిస్తూ.. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకునే వేదికగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు మరింత మేలు చేసేలా చర్చలు జరగాలని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Kavya Krishna Reddy participated in the AP Assembly

You cannot copy content of this page

Scroll to Top