త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 12: నెల్లూరు జిల్లా :కావలి.. దేశానికి సేవ చేసే రంగాలను యువత ఎంచుకోవాలి.. కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , పిలుపుభారతదేశానికి మూడు వైపులా సముద్రం ఉండటంతో తీరప్రాంత భద్రతపై ప్రతి పౌరుడికి అవగాహన అవసరమని, విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సైనికుడిలా ముందుకు రావాలని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , పిలుపునిచ్చారు.
కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సీనియర్ కమాండెంట్ సంజిత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. దేశభక్తి, జాతీయ సమైక్యతను ప్రజల్లో పెంపొందించడంతో పాటు తీరప్రాంత భద్రతపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ సైకిల్ యాత్రను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగు మాటి కావ్య కృష్ణారెడ్డి, మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు సీఐఎస్ఎఫ్ వంటి సైనిక దళాలు వచ్చి యువతలో అవగాహన కల్పించడం ఎంతో అభినందనీయమన్నారు. దేశ భద్రత కోసం ఎండనక వాననక కష్టపడే భద్రతా సిబ్బందికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేయాలని పేర్కొన్నారు.
వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, మహిళలు, యువతుల అక్రమ రవాణా, ఉగ్రవాదుల చొరబాటు నియంత్రణ, తదితర అంశాల పై తీరప్రాంత వాసులకు అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యపరచడం అభినందనీయమని కొనియాడారు. యువత మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, సీఐఎస్ ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వంటి విభాగాల్లో చేరి దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు.
జీవనోపాధి సాధించడంతో పాటు దేశంపై ప్రేమ కలిగి ఉండే వారే ఇలాంటి సేవా రంగాల్లో రాణించగలరని అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి భావన పెంపొందించేందుకు స్థానిక కళాశాలలు, పాఠశాలలు తీసుకున్న ముందడుగును ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించడమే ఈ సైక్లోతాన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
గత ఏడాది కూడా కావలి ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించారని గుర్తు చేస్తూ, ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో నిర్వహించాలని సీఐఎస్ఎఫ్ అధికారులను కోరారు. వచ్చే ఏడాది మరింత పెద్ద స్థాయిలో, పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్, కొచ్చిన్ తదితర ప్రాంతాలను కలుపుతూ దాదాపు 6533 కిలోమీటర్ల సుదీర్ఘ సైకిల్ యాత్ర చేపట్టడం గొప్ప విషయమని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, పాలడుగు రంగారావు, పద్మావతి శ్రీదేవి, జవహర్ భారతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం నాయుడు, విద్యార్థులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


