Minister Ponguleti Srinivas : భూభారతి చట్టంతో సాగులో ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది.

TRINETHRAM NEWS

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

దేవరకొండ ఏప్రిల్ 21 త్రినేత్రం న్యూస్. చందంపేట ; భూభారతి ద్వారా సాగులో ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూభారతి పేదల బడుగు బలహీన వర్గాల రైతులకు భూమి ఉన్న ఆసాముల కోసం తీసుకొచ్చిందని ఈ సందర్భంగా అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ భూభారతి 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సు కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టు కిందతీసుకొని ఈనెల ఆఖరి వరకు పూర్తవుతుందని., జూన్ రెండు నుంచి ఈ పైలట్ మండలాలలో వ్యవసాయ భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. మే ఒకటి నుంచి అన్ని జిల్లాలలో ఒక మండలాన్ని పైలట్ మండలంగా తీసుకునే విషయం పై ఆలోచిస్తామని తెలిపారు.
జూన్ రెండు నుంచి ప్రతి గ్రామానికి తహసిల్దార్ స్థాయి అధికారులు గ్రామానికి వచ్చి భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకుంటారని రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రైతుల భూముల సర్వే కోసం 6000 మంది లైసెన్స్ సర్వేయర్లను నియమిస్తామని ప్రతి గ్రామానికి ఒక పరిపాలన అధికారి చొప్పున 10695 మందిని వచ్చే నెల మొదటి వారం నుంచి పంపించనున్నామని ఆయన వెల్లడించారు.
ప్రతి మనిషికి ఆధార్ లాగే బోధర్ కార్డును ఇచ్చి ఖాతా నెంబర్ను ఇవ్వనున్నామని తెలిపారు. తమది సమస్యలను పరిష్కరించే ప్రభుత్వమని చేతల ద్వారా నిరూపిస్తామని మంత్రి తెలిపారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ,,,, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి వంద సంవత్సరాలు పనికొచ్చేలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని చందంపేట మండలంలోని పలు గ్రామా లలో అటవీ భూములకు పట్టాలిచ్చారని అయితే గడిచిన పదేళ్లలో రైతులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారని వీటన్నింటికీ సర్వే చేసి నిజమైన హక్కుదారులకు పట్టాలు ఇవ్వాలని అలాగే డీ ఫారెస్టు అసైన్డ్ భూముల సమస్యలు ఉన్నాయని తిరుమలగిరి సాగర్ లాగే చందంపేట మండలాన్ని పైలెట్ మండలం గా తీసుకొని ఇక్కడి సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు.
దేవరకొండ నియోజకవర్గం లో ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్నందున మదనపు కోట కింద ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయడంతో పాటు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నియోజకవర్గంలోని భూములకు సాగునీటి నీ తీసుకొస్తామన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1800 కోట్లతో ఏదుల నుంచి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు టెండర్లు పూర్తి చేయడం జరిగిందని దీని ద్వారా 1,50,000 ఎకరాలకు తాగునీరు వస్తుందని దీంతోపాటు చిన్నచిన్న లిఫ్ట్ పనులను త్వరగా పూర్తి చేస్తామని అన్నారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ,,,, ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చిందని పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తుందని వీటన్నింటిని ప్రజలు వినియోగించాలని కోరారు.
శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ,,, ధరణిలో అనేక సమస్యలు ఉండేవని సాగు కాలాన్ని తీసివేశారని అలాగే కొన్ని గ్రామాలు ధరణిలో బ్లాక్ చేయడం జరిగిందని వీటన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకు వచ్చిందని దీపారాస్ భూముల సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచించాలని నల్గొండ జిల్లాలో సర్వేయర్లు తక్కువగా ఉన్నందున మండలానికి ఒక సర్వేయర్ ను నియమించాలని క్షేత్రస్థాయిలో పరిశీలించి భూమిపై ఉన్న వారికే పట్టాలు ఇవ్వాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, అందరికీ మేలు జరిగేలా భూభారతిని తీసుకురావడం జరిగిందని తెలిపారు. 2020లో వచ్చిన ధరణి వల్ల చందంపేట మండలంలోని ఆరు గ్రామాలు బ్లాక్ లో ఉన్నాయని భూభారతి ద్వారా వాటిని పరిష్కరించే అవకాశం ఇప్పుడు ఉందన్నారు.
మోఖ మీద ఉన్న వారి పేరును భూభారతి ద్వారా ఎక్కించే బాధ్యత రెవెన్యూ శాఖ దేనిని భూభారతి ద్వారా తహసిల్దార్ ద్వారా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆమె తెలిపారు. ఒకవేళ పరిష్కారం కానట్లయితే 31 వ రోజు ఆటోమేటిగ్గా పరిష్కారం అవుతుందన్నారు.
ఈ అధికారాలు ఆర్డీవోకు ఉన్నాయని ఉచిత న్యాయ సహాయం ఏర్పాటు చేసే అవకాశం సంవత్సరానికి ఒకసారి భూమి రికార్డులను అప్డేట్ చేసే అవకాశం భూభారతిలో ఉందని కలెక్టర్ తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, దేవరకొండ అదనపు ఎస్పి మౌనిక, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

 the Bhu Bharati Act

You cannot copy content of this page

Scroll to Top