Trinethram News : చిలకలూరిపేట: పట్టణంలోని సుభాని నగర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగింది. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల వస్తువుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. షాపు నుండి మంటలు భారీ ఎత్తున బయటకు వ్యాపించాయి.
స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా సంఘటన స్థలానికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటనా స్థలంలో తహశీల్దార్ హుస్సేన్, మున్సిపల్ కమీషనర్ శ్రీహరిబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


