Tornado Tour : అరకు వ్యాలీ లో సుడిగాలి పర్యటన చేసిన ఐటీడీఏ పీఓ

TRINETHRAM NEWS

అరకులోయ జనవరి 6, (త్రినేత్రంన్యూస్): పాడేరు ఐటీడీఏ పీఓ ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, తిరుమణి శ్రీ పూజ అరకు వ్యాలీ మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు వ్యాలీ మండలం లిట్టిగూడ గ్రామంలోని మినీ అంగన్వాడి కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం నాణ్యత, హాజరు రిజిస్టర్లు, రికార్డులు, పిల్లల ఆరోగ్య పరిస్థితులను ఆమె పరిశీలించారు. కేంద్రంలో పనిచేస్తున్న అంగన్వాడి కార్యకర్తను అడిగి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.
ప్రస్తుతం ఉన్న అంగన్వాడి కార్యకర్తకు తోడుగా సపోర్టింగ్ టీచర్‌ను నియమించాలని పీడీ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. తద్వారా పిల్లలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని ఆమె సూచించారు.
ఈ సందర్భంగా పిల్లలతో కొంతసేపు ముచ్చటించిన జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడి కేంద్రాల పనితీరును మెరుగుపర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పిల్లలకు అవసరమైన అన్ని సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

ITDA PO conducts tornado tour

You cannot copy content of this page

Scroll to Top