Collector Dinesh Kumar : ప్రపంచ మార్కెట్ లో అరకు కాఫీ కి ప్రత్యేక స్థానం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్

TRINETHRAM NEWS

అరకులోయ, డిసెంబర్ 23, (త్రినేత్రంన్యూస్): అరకు కాఫీకి ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఉన్న సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సి సి ఆర్ ఐ) శతాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. 1925లో స్థాపితమైన ఈ పరిశోధనా సంస్థ కాఫీ పరిశోధనలో వందేళ్లు పూర్తి చేసుకోవడం గర్వకారణమన్నారు.
అరకు కాఫీ భవిష్యత్తు అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని, అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడేలా నాణ్యతను మరింత మెరుగుపరచడమే లక్ష్యమన్నారు. కాఫీ ప్రాసెసింగ్ యూనిట్లు, అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకురావడం, గిరిజన రైతులకు శిక్షణ ఇచ్చి దిగుబడి పెంచడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
గ్లోబల్ బ్రాండింగ్ ద్వారా ‘అరకు కాఫీ’ బ్రాండ్‌ను మరింతగా ప్రమోట్ చేసి విదేశీ ఎగుమతులను ప్రోత్సహిస్తామన్నారు.( సి సి ఆర్ ఐ) నేర్చుకున్న ఆధునిక సాగు పద్ధతులను అరకు వాతావరణానికి అనుగుణంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ పర్యటనతో అరకు కాఫీ రంగానికి కొత్త ఊపు లభిస్తుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Araku coffee has a special place in the world market

You cannot copy content of this page

Scroll to Top