Service of Auto Drivers : ఘనంగా ఆటో డ్రైవర్ల సేవలో

TRINETHRAM NEWS

తేదీ : 04/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్): చింతలపూడి, నూజివీడు నియోజకవర్గం లో ఘనంగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం జరిగింది. చింతలపూడి నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు సాంగా. రోషన్ కుమార్, అదేవిధంగా నూజివీడు నియోజకవర్గంలో డైనమిక్ శాసనసభ్యులు , గృహ నిర్మాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు .పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి అందించమని అన్నారు.

అదేవిధంగా స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతున్న సందర్భంలో ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ఉండుందుకు వీళ్లు ప్రజలకు చేసే రవాణా సేవకు వీళ్లను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా .చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ , విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతట సొంతంగా ఆటో ఉండి, ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండి అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా ఉన్న వాళ్లకు ఏడాదికి రూపాయలు పదిహేను వేలు చొప్పున వాళ్ల బ్యాంకు ఖాతాలో కూటమి ప్రభుత్వం జమ చేయనుంది. అర్హులైన ప్రతి ఒక్క ఆటోడ్రై వరకు అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

service of auto drivers

You cannot copy content of this page

Scroll to Top