తేదీ : 17/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, డైనమిక్ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ కార్యకర్త అధినేత అని అన్నారు. ఆయన ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి అనే ఆలోచన విధానం చాలా అద్భుతమైనది. తనను కలవడానికి వచ్చే వాళ్లను ఆప్యాయంగా పలకరించాలి, వాళ్ల సమస్య లు వినాలి .
అనేటువంటి ఆలోచనతో గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యకర్తలు ఎవరైనా ఎమ్మెల్యేను కలవడానికి రావచ్చని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నాయకులు కలవాలంటే సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఏడు గంటలలోపు కలవాలని సూచించారు. ఒకవేళ అత్యవసరంగా మాట్లాడాలి అనుకుంటే ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చని చెప్పారు. ఈ సదవకాశాన్ని అందరూ సమయానుగుణంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


