Holi Celebrations : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ మార్చ్ 03, త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు ఈరోజు హోలీ సంబరాలు ఘనంగా సభ్యులు జరుపుకున్నారు. చిన్నారులు పెద్దలు కుల మత చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎన్ వీ టీ మాట్లాడుతూ శీతాకాలం ముగిసి ప్రకృతి రంగు రంగుల పూలతో కళకళలాడే వసంత రుతువు ప్రారంభానికి సంకేతంగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారని. ముఖ్యంగా ఈ హోలీ పండుగను సామాజిక ఐక్యతకు నిదర్శనంగా భావిస్తారు.

కుల మత, వర్గ భేదాలు లేకుండా ఆనందంతో ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఉల్లాసంగా ఈ పండుగను జరుపుకుంటారు.రాక్షసి హోలిక అగ్నిలో దహనమైన కథను గుర్తుచేస్తూ, చెడు గుణాలను దహనం చేయడానికి హోలికా దహనం చేస్తారు.ఇది పాత విభేదాలను తొలగించి, కొత్త స్నేహాన్ని, ప్రేమను పెంపొందిస్తుందనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో కే పంతుల నాయక్ , ఎస్ బి ఐ సర్వీస్ మేనేజర్ ఎన్ వెంకట్రాం, కరాట మాస్టర్ గోపి, తాళ్ల సురేష్, ఎన్ పూర్యా నాయక్, రాజు, రతన్, కేశవ్, జమీర్, పొట్ట మధు, చిన్నారులు క్రీడాకారులు కళాకారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Holi celebrations under the auspices

You cannot copy content of this page

Scroll to Top