Police Arrested Cable Thieves : ఎట్టకేలకు కేబుల్ దొంగల అరెస్టు చేసిన పెనుమూరు పోలీసులు

TRINETHRAM NEWS

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్. త్రినేత్రం న్యూస్. కొద్ది రోజులుగా పెనుమూరు మండలంలోని వివిధ గ్రామాల్లో రైతుల పొలాల్లో కేబుల్ వైర్లు దొంగతనం గురించి చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఉత్తర్వులు మేరకు, చిత్తూరు ఎస్ డి పి ఓ సాయినాథ్ వారి పర్యవేక్షణలో, చిత్తూరు ఈస్ట్ సీఐ రామచంద్ర ఆధ్వర్యంలో, పెనుమూరు ఎస్సై శ్రీనివాసులు మరియు కొంతమంది పోలీస్ సిబ్బంది ఒక టీం ఏర్పడి దొంగతనాల మీద ప్రత్యేక దృష్టి సారించారు.

ఎట్టకేలకు ఈరోజు మంగళవారం సుమారు ఒంటి గంట ప్రాంతంలో పెనుమూరు మండలం కొత్త రోడ్ జంక్షన్ వద్ద ఇద్దరిని అరెస్టు చేయడం జరిగింది. వారి పేర్లు బాలాజీ ఎర్ర వారి పాలెం మండలం ఇతని మీద 12 కేసులు నమోదు అయి ఉన్నాయి. ఇంకొకరు ఉదయ్ అత్తిమకుల పల్లె పెనుమూరు మండలంకు చెందినవాడు.

వీళ్ళ దగ్గర ఎనిమిది కేజీల రాగి వైరు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశారు. రైతులకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా మీ చుట్టుప్రక్కల పొలాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పెనుమూరు ఎస్సై ఫోన్ నెంబర్ 944090068 గాని, 112 గాని తెలియజేయవలసిందిగా పోలీసు వారి మనవి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

police finally arrested the cable thieves

You cannot copy content of this page

Scroll to Top