Holi Celebrations : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు

TRINETHRAM NEWS

వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు

Trinethram News : వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రంగుల హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పాల్గొని నాయకులతో కలిసి ఆనందంగా రంగులు చల్లుకున్నారు.

సంప్రదాయ పద్ధతులతో, స్నేహభావం మరియు ఐక్యతను ప్రతిబింబించేలా హోలీ పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, హోలీ పండుగ మన సంస్కృతిలో ఐక్యత, ప్రేమ, సోదరభావానికి ప్రతీక అని తెలిపారు.

సమాజంలో వర్గ, మత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Holi celebrations in grand style under the Congress Party

You cannot copy content of this page

Scroll to Top