సెప్టెంబర్ 7, 2026
TRINETHRAM NEWS
Three-Year Jail Term

Three-Year Jail Term : హైదరాబాద్ నాగోల్ జోన్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నాగోల్ పోక్సో కేసులో నిందితుడు ఉప్పు రాకేష్ (24)కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ ఎల్‌బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ.50 వేల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది.

నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 405/2025లో బీఎన్‌ఎస్ సెక్షన్ 78, పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద కేసు నమోదైంది. ఈ కేసులో నాగోల్ ఎస్‌ఐ పి. శివ నాగ ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. అదనపు పీపీలు శోభారాణి, పి. సత్యనారాయణ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. కోర్టు కానిస్టేబుల్ రాజు, సమన్స్ కానిస్టేబుల్ వెంకటేష్, ఏఎస్సై పి. శోభ కేసు విచారణలో సహకరించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page