కష్టకాలం నుండి అభివృద్ధి బాటలోకి
ఏడాదిలో అద్భుతమైన పురోగతి సాధించాం
ప్రజల నమ్మకాన్ని… విశ్వాసాన్ని నిలబెట్టాం-
రూ.200 కోట్లతో రాజమండ్రిలో అభివృద్ధి పనులు చేపట్టాం
ఏడాది ప్రగతి వివరించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి,రాజమహేంద్రవరం: రాజమండ్రి నగరంలో ఏడాదిలో రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సుపరిపాలన పూర్యయిన సందర్భంగా గురువారం మంజీరా ఫంక్షన్ హాలులో కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, నగర ప్రముఖులు, వ్యాపారులు, మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాదిలో తన అభివృద్ధి యాత్రను ప్రస్తావించారు. నగరాన్ని పర్యాటక, స్పోర్ట్స్, కల్చరల్, ఐటి హబ్ గా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ప్రజలు తనను సుమారు 73 వేలకు పైగాభారీ ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు వారికి ఉపయోగపడే అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన చెప్పారు.
మహిళల రక్షణకు మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం చేపట్టామని, బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ లను అణచివేశామని, సారా విక్రయాలపై ఉక్కుపాదం మోపామని, చీకటిలో అల్లరి మూకల ఆగడాలు అరికట్టేందుకు రూ.98 లక్షలతో వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తున్నామని ఆయన చెప్పారు. మహిళల స్వయం ఉపాధికి 20 మంది మహిళలకు రాపిడో బైక్ లో కోసం వడ్డీ లేని రుణాలు మంజూరు చేయించామని,500 మందికి కుట్టు శిక్షణ కార్యక్రమం ఇచ్చి మిషన్లు అందచేస్తామని ఆయన తెలిపారు. ఆరోగ్య రాజమండ్రిలో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తున్నామని, 30 పార్కులను సుందరీకరణ చేసేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిని ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టామని, అవినీతి అరికట్టేందుకు కూటమి నాయకులతో కలిసి కృషి చేశామని ఇప్పుడు రోజు 1500 మంది ఓపీ సేవలు పొందుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు.
దాతల సహకారంతో, పేపరు మిల్లు సీఎస్ఆర్ ఫండ్స్ తో ఆధునిక పరికరాలు అందించామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 128 మందికి రూ.కోటి 75 లక్షలు అందించామని, త్వరలో 70 మందికి రూ. కోటి 30 లక్షలు ఇప్పిస్తామని ఆయన అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉచితంగా ఇప్పిస్తున్నామని, డీఎస్సీ అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహించామని, తన స్ఫూర్తితో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, కొంతమంది ఎమ్మెల్యేలు వారి ప్రాంతంలో డీఎస్సీ అభ్యర్థులకు మాక్ టెస్టులు ఉచితంగా ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారునగరంలోని కోటిలింగాల పేట ముంపు సమస్య పరిష్కారానికి పేపరుమిల్లు సీఎస్ఆర్ నిధులతో చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. బీసీ వసతి గృహాల్లో మరుగుదొడ్లు మరమ్మతులు చేయించామని, 45వ వార్డులో కమ్యూనిటీ హాలు బాగు చేయిస్తున్నామని, సుమారు రూ. 3.80 కోట్ల సీఎస్సార్ నిధులు ఇంతవరు తీసుకు వచ్చి పనులు చేపడుతున్నామని ఆయన వివరించారు.
వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. నగరంలో 1000 చెట్లు నాటేందుకు చర్యలు చేపట్టామని, ఓఎన్జీసీ నుంచి రూ.15 లక్షలు సాధించగలిగానని వాటితో మరో కుట్టు శిక్షణ సెంటర్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. కూటమిలోని టీడీపీ, జనసేన బీజేపీ నాయకులు సహకారంతో ఇవన్నీ పారదర్శకంగా చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభించామని, త్వరలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సహకారంతో అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. రాజమండ్రి ప్రజలకు తమ కుటుంబం రుణపడి ఉంటుందని, తమ ఇంట్లో మేయరు, ఎమ్మెల్సీ, ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యేందుకు ఆశీస్సులు అందచేశారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కాలువల పూడిక తీయిస్తున్నామని, దీనివల్ల వర్షం కురిసిన సమయంలో గంటలోపే రోడ్లమీద నీరు లాగేస్తోందని ఆయన అన్నారు. తప్పుచేస్తేసొంతపార్టీ వారిని కూడా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, కూటమి నాయకులు కాశి నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వర్రే శ్రీనివాస్, రెడ్డి మానేశ్వరరావు, బుడ్డిగ రాధా, వై శ్రీను, కురగంటి సతీష్, అడబాల రామకృష్ణ, బూరా రామచంద్రయ్య, జామి సత్యనారాయణ, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


