
Chandana Nageswar : త్రినేత్రం న్యూస్, శాటిలైట్ సిటీ, ఆగస్టు 17: శాటిలైట్ సిటీ సి బ్లాక్‌లో నివాసం ఉంటున్న ఆదూరి శ్రీనివాస్ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, గోపాలపురం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) చందన నాగేశ్వర్ సోమవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆదూరి శ్రీనివాస్ నివాసానికి వెళ్లిన చందన నాగేశ్వర్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe