ప్రభుత్వ వైఫల్యం, బీసీల ఆత్మగౌరవానికి అవమానం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం నిర్లక్ష్యమైన నిర్వాహణ కారణంగా GO నంబర్ 9 పై హైకోర్టులో స్టే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బి.ఆర్.కృష్ణ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ తరపు వాదనలు శాస్త్రీయమైనవి, సమగ్రమైనవి కాకపోవడంతో బీసీల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని, వారి రాజకీయ భవిష్యత్తును బజారుపడేలా చేసిందని ఆయన విమర్శించారు.
దాదాపు రెండు సంవత్సరాలుగా కొలిక్కిరాని బీసీల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయిందని, ఇక గ్రామాల్లో సర్పంచ్‌లు లేకపోవడంతో అభివృద్ధి ఆగిపోయి, గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బి.ఆర్.కృష్ణ ముదిరాజ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో శాస్త్రీయమైన, సమగ్ర వాదనలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఇకనుంచి బీసీల రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలంటే, ప్రభుత్వం చొరవ తీసుకుని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి, ప్రధానమంత్రిని కలిసి, 42 శాతం బీసీ రిజర్వేషన్లపై విపులంగా విన్నవించాలని బి.ఆర్.కృష్ణ ముదిరాజ్ ప్రభుత్వానికి విన్నవించారు. తమిళనాడు రాష్ట్రం మాదిరిగా, ఈ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చినప్పుడే రాజ్యాంగ భద్రత వస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా చేస్తే బీసీల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారని, యావత్ బీసీ లోకం హర్షిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


