BC Reservations : 42% బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో చట్టం చేయాల్సిందే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి అమలు చేయాల్సిందేనని, కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని NTR చౌరస్తాలో ధర్నా చేయడం జరిగింది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం చేసి వెంటనే అమలు చేయాలని, 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ, ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ తీర్మానం చేసి 42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రానికి ఆమోదం కోసం పంపిందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ 42 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో చట్టం చేయకుండా రిజర్వేషన్లకు మతం రంగు పులుముతున్నదని విమర్శించారు. రిజర్వేషన్లు ఇచ్చేది మత ప్రాతిపాదికన కాదని, వెనుకబడిన వర్గాలకు ఆర్థిక,రాజకీయ,సామాజిక సమాన అవకాశాలు కల్పన కోసం అన్న అంశాన్ని బిజెపి పక్కన పెడుతుందని విమర్శించారు. విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో సమానత్వాన్ని నిరాకరిస్తున్నదని,అందుకే బీజేపీ బీసీ రిజర్వేషన్లను పక్కన పెట్టాలని భావిస్తుందన్నారు.

బిజెపి పాలిత రాష్ట్రాలలో అమలు చేస్తున్న రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మత ప్రతిపాదికన ప్రజలను విభజించడం కోసం రిజర్వేషన్లను మతానికి పరిమితం చేస్తున్నారని విమర్శించారు. చట్ట సవరణ చేసి భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని, ఆ దిశగా బీసీ రిజర్వేషన్లకు సైతం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో బి చంద్రయ్య ఆర్ నవీన్ నాయకులు సత్తయ్య లాలయ్య లక్ష్మయ్య శంకర్ శేఖర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Parliament for 42% BC reservations.

You cannot copy content of this page

Scroll to Top