ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
Jaladhara-Jalaharati

మూడు విభాగాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం

Jaladhara-Jalaharati : అల్లూరిజిల్లా పాడేరు, ఆగస్టు 10, (త్రినేత్రం న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలధార–జలహారతి కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా సత్తా చాటింది. కార్యక్రమం అమలులో మూడు కీలక విభాగాల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది.
అత్యధిక సంఖ్యలో పనులు చేపట్టడం, అత్యధిక నూతన నీటి నిల్వ సామర్థ్యాన్ని సృష్టించడం, అత్యధిక ఆశించిన ఫలితాలను సాధించడంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కలెక్టర్‌ టి. నిశాంతి నాయకత్వంలో జిల్లా యంత్రాంగం సమన్వయం, నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి అమలుపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ ఘనత సాధ్యమైందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విజయం అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి ఫలితమన్నారు. జల సంరక్షణ, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, స్థిరమైన నీటి వనరుల అభివృద్ధికి భవిష్యత్‌లోనూ ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page