Gummadi Rajalingu Foundation : గుమ్మడి రాజలింగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు స్కూల్ బ్యాగ్స్‌, పెద్దలకు దుప్పట్ల పంపిణి

TRINETHRAM NEWS

కూకట్పల్లి డిసెంబర్ 22 (త్రినేత్రం న్యూస్): కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ లో సమాజంలో అవసరమైన వారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వం. అదే స్ఫూర్తితో గుమ్మడి రాజలింగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు స్కూల్ బ్యాగ్స్‌ను, అలాగే పెద్దవారికి దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలు ఆనందంగా బ్యాగ్స్ స్వీకరించగా, చలికాలంలో ఇబ్బందులు పడుతున్న పెద్దవారికి దుప్పట్లు అందజేయడం ద్వారా వారికి కొంత ఊరట కలిగినట్టయ్యింది. పిల్లల ముఖాల్లో కనిపించిన చిరునవ్వులే మా సేవా కార్యక్రమానికి నిజమైన బహుమతిగా భావిస్తున్నాము.

ఈ సందర్భంగా గుమ్మడి కిరణ్ మాట్లాడుతూ మా ఫౌండేషన్ స్థాపకులు గుమ్మడి రాజలింగు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. విద్య, ఆరోగ్యం,మానవ సేవ అనే మార్గంలో ముందుకు సాగుతూ, అవసరమైన ప్రతి ఒక్కరికీ సహాయం అందించాలన్నదే మా సంకల్పం. చిన్న సహాయమైనా, అది ఎవరో ఒకరి జీవితంలో పెద్ద మార్పుకు దారి తీస్తుందని మేము నమ్ముతున్నామని తెలిపారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, సమాజానికి అండగా నిలవడానికి గుమ్మడి రాజలింగు ఫౌండేషన్ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gummadi Rajalingu Foundation distributes school bags

You cannot copy content of this page

Scroll to Top