Prema Kumar : అయ్యప్ప స్వామి ఇరుముడి సమారోహం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి డిసెంబర్ 22 (త్రినేత్రం న్యూస్) : ఈ రోజు కూకట్‌పల్లి కెపిహెచ్‌బి రోడ్ నెంబర్ టూ లో సాయిబాబా గుడి లోని – అయ్యప్ప స్వామి పీట్టం లో అత్యంత భక్తి పర్వకంగా, పవిత్రత నిండిన వాతావరణంలో అయ్యప్ప స్వామి ఇరుముడి సమారోహం ఘనంగా నిర్వహించబడింది. అడపా సుబ్బారావు గురు స్వామి చేతులమీద జనసేన నాయకులు పులగం సుబ్బు కి సంప్రదాయ విధానంలో ఇరుముడి కట్టి, వారిని శబరిమల యాత్రకు పంపించే ఈ పుణ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ పాల్గొన్నారు. దేవాలయ ఆవరణము అంతా అయ్యప్ప “స్వామి శరణం అయ్యప్ప” అన్న నినాదాలతో నిండిపోయింది. ప్రతి భక్తుడిలో ఒక ప్రత్యేకమైన భక్తి స్పూర్తిని నింపాయి. ఆలయ పురోహితులు వేద మంత్రోచ్చరణల మధ్య ఇరుముడి దారణ, అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు.
గురు స్వామి చేతులమీద ఇరుముడి కట్టడం ఎంతో శాస్త్రోక్తంగా, నియమ నిష్టలతో నిర్వహించబడగా, పులగం సుబ్బు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకొని యాత్రకుపయనమయ్యేందుకు సిద్ధమయ్యారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, కలిగినీడి ప్రసాద్, పోలేబోయిన శ్రీనివాస్, భోగాది యోగేష్ నాయుడు ,బండిరెడ్డి గోపి, పి. గోపి , హరిబాబు, వీర మహిళ శిరీషా మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janasena leaders who participated in the Ayyappa Swamy Irumudi Samaroham program

You cannot copy content of this page

Scroll to Top