Pension of the Disabled : తొలగించిన దివ్యంగుల పెన్షన్ వెంటనే పునరుద్దించాలి

TRINETHRAM NEWS

ధవలేశ్వరం కలెక్టరేట్ వద్ద హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి, ముత్యాల పోసి కుమార్, ధర్నా

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధవలేశ్వరం గ్రామం నందు దివ్యాంగుల తొలగించిన పింఛన్లను వెంటనే పునర్దరించాలని. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ముత్యాల పోసి కుమార్ ఆధ్వర్యంలో దివ్యాంగుల మహాధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి దివ్యాంగులకు మద్దతుగా వైయస్సార్సీపి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లు బో రాయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కోతలు లేకుండా దివ్యాంగుల అందరికీ సమానంగా 3000 రూపాయలు పింఛన్ అందించిన ఘనత జగనన్నదని.

ఈరోజు సదరం సర్టిఫికెట్లు రీ వెరిఫికేషన్ పేరుతో అర్హులైన ఎంతోమంది దివ్యాంగుల ఉసురు పోసుకున్న నేత చంద్రబాబు నాయుడు అని. దివ్యాంగులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని. తొలగించిన దివ్యాంగ పింఛన్లు పునరుద్ధరించే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దివ్యాంగుడు వెంట ఉండి మరలా పింఛన్ వచ్చేవరకు పోరాడుతుందని అన్నారు. వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు. దివ్యాంగులను రీ వెరిఫికేషన్ పేరుతో బాధ పెడుతున్నారని వీళ్ళ ఉసురు కూటమి ప్రభుత్వానికితగలక తప్పదని అన్నారు.

ఈ కార్యక్రమంలో దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసి కుమార్ మాట్లాడుతూ. దివ్యాంగులకు సదరన్ సర్టిఫికెట్లు రీ వెరిఫికేషన్ పేరుతో డాక్టర్లు అడ్డగోలుగా సదరన్ పర్సంటేజ్ ను తగ్గించారని. పోస్ట్ పోలియో ఉన్న వ్యక్తులకు పోలియో శాతం ఎలా తగ్గుతుందని. వయస్సు రిచాఇంకా వికలాంగుల శాతం పెరగవలసిన. తగ్గిందని డాక్టర్లు ఎలా నిర్ధారించారని. ఎం ఆర్ పిల్లలకు పట్ల సదరన్ రి వెరిఫికేషన్ లో పూర్తిస్థాయి అన్యాయం జరిగిందని. రి వెరిఫికేషన్ లో వెరిఫికేషన్ పేరుతో డాక్టర్లు దివ్యాంగులను అవమానించారని. వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల సంఘాల నాయకుడు సబెల్లె విజయదుర్గా రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగ పింఛన్లు పునరుద్ధరించే వరకు ఎటువంటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవెల్లిభరత్ కుమార్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పలివెల రాజు. ఏ ఐ డి ఆర్ ఎఫ్ కె.వి.ఆర్ సాగర్. ఆదం పకీర్. కండెల్లి రజిని కుమార్. మహిళా నాయకులు సత్యవతి. బసన్న బోయిన దుర్గ. డివిఆర్ రాజు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దివ్యాంగుల హక్కుల వేదిక గౌరవ అధ్యక్షుడు ముద్దా లా అను. దివ్యాంగులు పింఛన్ కోల్పోయిన మానసిక దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తదుపరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో. గ్రీవెన్స్ సందర్భంగా. డిఆర్ఓగారికి మాజీ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వినతిపత్రం అందించారు దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The pension of the disabled

You cannot copy content of this page

Scroll to Top