Protection : మీ మాటే మాకు శ్రీరామ రక్ష

TRINETHRAM NEWS

వైజాగ్ కాలని వాసులు* .

దేవరకొండ ఆగష్టు 25 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలో నేరేడుగొమ్ముమండలంలోని వైజాగ్ కాలని వాసుల సమస్యల పరిష్కారం కొరకు దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తన నివాసం వద్ద పోలీస్ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి ఎం ఎల్ ఏ బాలు నాయక్ సమావేశం నిర్వహించారు.
ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వైజాగ్ కాలనిని రాష్ట్రంలోనే మొదటి ఎకో టూరిజం ప్రాంతంగా మార్చే కార్యక్రమం చేబడుతున్నామని, త్వరలో ఎకో టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసి కాలని వాసులకు జీవన ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేబట్టబోతున్నామ న్నారు. వైజాగ్ కాలనికి వచ్చే పర్యాటకులకు తగిన రక్షణ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, మాజీ ఎంపీపీ బిక్కు నాయక్,సర్వయ్య యాదవ్ ,మాజీ వైస్ ఎంపీపీ పాప నాయక్, సిఐ బీసన్న, ఎస్సై, యువ నాయకులు రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Your word is our protection

You cannot copy content of this page

Scroll to Top