త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 22: నెల్లూరు జిల్లా: కావలి.. రాష్ట్రంలో మూడో స్థానంలో కావలి – ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి … నెల్లూరు జిల్లా,వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం కావలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 53 మంది లబ్ధిదారులకు రూ. 43,20,856 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
అదేవిధంగా ఎల్‌ఓసీ కింద రూ. 2.40 లక్షల సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇప్పటివరకు 1385 మంది దరఖాస్తుదారుల్లో 1018 మందికి మొత్తం రూ. 8,21,26,116 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. మిగిలిన 367 మందికి సంబంధించిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే వారికి కూడా సహాయం మంజూరు చేస్తామని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో రాష్ట్రంలోనే కావలి మూడో స్థానంలో నిలవడం గర్వకారణమని అన్నారు.
ఎంతో మంది నిరుపేదలు వివిధ వ్యాధులతో బాధపడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతూ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితం గడుపుతున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీ వర్తించని సందర్భాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ముఖ్యమంత్రి సహాయం కోరితే, కావలి నియోజకవర్గంలో కులమతాలు,వర్గభేదాలు, పార్టీలు చూడకుండా అందరికీ సీఎం సహాయ నిధి అందజేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించకుండా దెబ్బతీశారని ఆరోపించారు. హిందువులు పవిత్రంగా భావించే కలియుగ దైవం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని ఆరోపిస్తూ, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు,లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


