New Governing Body : దేవరకొండ మున్సిపల్ నూతన పాలకవర్గానికి సన్మానం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 22, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నిక కాబడిన మున్సిపల్ చైర్మన్ పున్నా శైలజ వెంకటేష్, వైస్ చైర్మన్ తబస్సుమ్ మరియు కౌన్సిలర్లను ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పున్న శైలజా వెంకటేష్ మాట్లాడుతూ… బీసీ సంఘం బలోపేతం చేయడానికి, మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి ఎనలేని కృషి చేస్తానని తెలిపారు.
నజీర్ మాట్లాడుతూ బీసీ సంఘం బలోపేతం కోసం ఉద్యమాలను ఉదృతం చేయడానికి ముందుంటానని తెలిపారు ఈ సన్మాన కార్యక్రమంలో సామాజికవేత్త బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించబడింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు 20 మంది వార్డు కౌన్సిలర్లు అందరూ వార్డులలో ఉన్నటువంటి సమస్యలపై దృష్టి సారించి వార్డు సభ్యులందరికీ న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్లాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చొల్లేటి భాస్కరాచారి రెడ్డి కోటేశ్వరరావు ఎం.డి రంజాన్ బేగ్ కొండపల్లి శ్రీను వరికుప్పల శ్రీను కూరెళ్ళ కృష్ణమాచారి పున్న వెంకటేష్ నేత, మెరుగు శీను, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Devarakonda Municipality felicitates new governing body

You cannot copy content of this page

Scroll to Top