CM Chandrababu : సూపర్ సిక్స్ ని హిట్ చేశాం

TRINETHRAM NEWS

గుంటూరు జిల్లా : అమరావతి : జనవరి 17: (త్రినేత్రం న్యూస్); సూపర్ సిక్స్ పథకాన్ని సూపర్ హిట్ చేసామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని వేగంగా పరిగెత్తిస్తున్నామని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం మన రాష్ట్రానికే దక్కాయని వెల్లడించారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఏకంగా రూపాయలు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.

ఈ పెట్టుబడులతో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We have made the Super Six a hit

You cannot copy content of this page

Scroll to Top