Trinethram News : Feb 13, 2026, రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రామ రెవెన్యూ వ్యవస్థలో భారీ మార్పులు చేస్తూ, కొత్తగా 10,954 ‘గ్రామ పాలన అధికారి’ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు డిగ్రీ అర్హతగా నిర్ణయించారు.
కలెక్టర్లకే నియామక, క్రమశిక్షణ అధికారాలు కట్టబెట్టారు. కొత్తగా చేరేవారికి మూడేళ్లు ప్రొబేషన్, బాండ్ తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

