TRINETHRAM NEWS

ఉద్యోగులకు, పింఛను దారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పే అవకాశం ఉంది. మార్చి 2024లో కరువు భత్యం (డీఏ)ను నాలుగు శాతం పెంచే అవకాశం ఉందని సమాచారం.

7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా డీఏ పెంపు ఉండనుంది. ఇంతకు ముందు అక్టోబర్ 2023లో చివరిసారిగా డీఏను నాలుగు శాతం పెంచారు, దీంతో అది 42 శాతం నుంచి 46 శాతానికి చేరుకుంది. ఈ నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందారు. మార్చిలో డీఏ పెంపు 4 శాతం మేర ప్రకటించినట్లయితే డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతానికి చేరుకుంటుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగడంతో పాటు పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ కూడా పెరగనుంది. 2024 జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే కాలానికి ఇది వర్తించనుంది. దీనిని ఏడాదికి రెండుసార్లు సవరిస్తారు. దేశ ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది.