తేదీ : 29/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రంలోని విజయవాడ పద్నాలుగు ఏళ్ళ వయసులో ఐపిఎల్ క్రికెట్ ఆడడమే. కేవలం ముప్ఫై ఐదు బంతుల్లో సెంచరీ సాధించి అరుదైన రికార్డు క్రియేట్ చేసిన యువ క్రికెటర్ సూర్యవంశంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ అధ్యక్షులు యం పి కేశినేని. శివనాథ్ (చిన్ని). హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సూర్యవంశం ప్రతిభను ప్రశంసించడం జరిగింది. అతి చిన్న వయసులో దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా పంచ స్థాయిలో గుర్తింపు పొందడంతో చాలా ఆనందంగా ఉందన్నారు.
వంశీకి మంచి భవిష్యత్తు ఉంటుందని, మరెన్నో రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రం నుండి ఇలాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలికి తీసేందుకు ఏసీఏ కృషి చేస్తుందని తెలిపారు. వైభవ్ సాధించిన సెంచరీ ఆయన క్రమశిక్షణ, నిబంధత, పట్టుదలకి నిదర్శనమని కొనియాడారు. యువ క్రికెటర్లు సూర్య వంశీని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.


