Girajala Babu : సమాజంలో మంచి, మానవత్వాలు పెంచాలి

TRINETHRAM NEWS
Girajala Babu Good and human

పాతికి లక్షల దొరికిన బంగారాన్ని బాధితులకు అందజేసిన
నామాల లక్ష్మణ్ కి సత్కారం
—బాధ్యత సేవా సంస్థ అధ్యక్షుడు గిరజాల బాబు
Girajala Babu : త్రినేత్రం న్యూస్ : నానాటికి అడుగంటి పోతున్న మంచి, మానవత్వ.. విలువలు పెంచాలని అందుకోసం కృషి చేసిన వారు ఎవరైనా సరే! తాము అభినందించి ప్రోత్సహిస్తూ ఉంటామని బాధ్యతా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గిరజాల బాబు పేర్కొన్నారు. ఆటోలో ప్రయాణిస్తూ ఓ కుటుంబం పాతిక లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని పోగొట్టుకుంటే… అది దొరికిన ఏడిద గ్రామానికి చెందిన నామాల లక్ష్మణ్ అనే యువకుడు భద్రంగా పోలీసుల ద్వారా వారికి చేరవేసిన నిజాయితీ సంఘటనను ఇటీవల మనం చూసాం. బాధ్యతా సేవా సంస్థ బృందం గురువారం ఏడిద గ్రామం లక్ష్మణ్ గృహానికి వెళ్లి అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. నిరుపేద కూలీగా ఉన్నా తనదిగాని సొమ్మును బాధితులకి అందించటం గొప్ప మానవత్వం అన్నారు.

లక్ష్మణ్ ఔదార్యగుణం సమాజంలో నేటి యువతకి ఆదర్శమని ఈ సందర్భంగా బాబు పేర్కొన్నారు. ఇటువంటివారిని అందరూ అభినందించాలని ఆయన కోరారు అందుకే ఇవేళ బాధ్యత సేవా సంస్థ తరపున లక్ష్మణ్ ను అభినందించడానికి వచ్చామని గిరజాల తెలిపారు. గతంలో విజయవాడ పెనమలూరు లో చెప్పులు లేకుండా రోడ్డు దాటుకు వెళుతున్న నిరుపేద పిల్లలను చూసి చలించిపోయి వాళ్లను వెంటనే జోళ్ళ దుకాణానికి తీసుకెళ్లి చెప్పులు కొనిపెట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకట రత్నాన్ని కూడా విజయవాడ వెళ్లి ట్రాఫిక్ మధ్యలో సత్కారం చేసి అభినందించామని బాబు తెలిపారు.

అలాగే ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో సొంత కష్టార్జితంతో రెండెళ్ల బండి నడుపుకుని జీవనం పోషించుకునే సాధారణ వ్యక్తి తండ్రి సంకల్పం మేరకు దాదాపు పదిలక్షల రూపాయల వ్యయంతో … డెల్టా శిల్ఫి కాటన్ విగ్రహాన్ని , ఆనుకుని ఒక చిన్న పార్కును ఏర్పాటుచేసి తన పెద్ద మనసును చాటుకున్నాడు దొడ్డా సత్తిపండు. ఆ ఊరు వెళ్లి స్థానికల సమక్షంలో అతన్ని కూడా అభినందిస్తూ సన్మానం చేశాం. ఇలా మంచి ఎక్కడ ఉన్నా, మానవత్వం ఎక్కడ కనిపించినా!

వాళ్లని అభినందిస్తూ సత్కారం చేస్తున్నాం. కొన్ని పనులు మనం చేయలేకపోయినా చేసేవారిని ప్రోత్సహించడం చేసినంత ఉత్తమమే! అని పెద్దలు చెప్తూ ఉంటారు. సమాజంలో విలువలు పెరగాల్సిన అవసరం చాలా ఉంది. అందుకోసం అక్కడ అక్కడా అరుదుగా కనిపిస్తున్న ఇటువంటి బాధ్యత గల వ్యక్తులను మనం అభినందిస్తే! మంచి సమాజం కోసం, మంచి పౌరులు కోసం కృషి చేసినట్లు అవుతుంది.అందరూ కూడా ఇలాంటి ఆదర్శ వ్యక్తులను అభినందనలతో భుజం తడితే సమాజంలో మరింత మంచి పెరుగుతుందని నమ్ముతూ అలా అందరూ చేయాలని కోరుతూ చేతులెత్తి నమస్కరిస్తూ మనవి చేస్తున్నాను.గ్రామ పెద్దలు పలివెల సుధాకర్, వల్లూరి రామకృష్ణ వాసిరెడ్డి అర్జున్, టీవీ గోవిందరావు, ఉంగరాల వీరభద్రరావు షేక్ సర్కార్ భాషా, చిలుకూరి శ్రీనివాసరావు, దామిశెట్టి అశోక్, కొక్కిరాల వెంకటేశ్వరరావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top