జూలై 5, 2026
TRINETHRAM NEWS
Girajala Babu Should we

తొట్టెలు ఖాళీగా పెట్టడానికే వీటిని నిర్మించారా? ప్రతిపక్ష నేత గిరజాల ఆవేదన

Girajala Babu : త్రినేత్రం న్యూస్ : కడియం మండలంలో పశువులు పక్షులు నీటి కోసం ప్రభుత్వ ఏర్పాటు చేసిన నీళ్ల తొట్టెలు సిబ్బంది నిర్లక్ష్యంతో నీళ్లు నింపక పశువులు విలవిల్లాడుతున్నాయని మండల ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం ఖాళీగా ఉన్న నీటి తొట్టెలను పరిశీలించారు. ప్రభుత్వం పశుపక్షాదులు తాగునీటి కోసం వీటిని ఏర్పాటు చేసిందని కానీ ఎప్పుడూ నీళ్లు లేకుండా దర్శనమిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు, స్థానిక ప్రజలు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. మండల కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ సమస్యను తాను ప్రస్తావించగా రెండు రోజులు నీళ్లతో తొట్టెలను నింపారని, మరలా షరా మామూలు గా వదిలేసారని ఆయన విమర్శించారు. పక్కనే వాటర్ ట్యాంక్ ఉన్నా కనీసం నీటినితో నింపటలేదన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నీళ్లు నింప లేనప్పుడు వీటిని ఎందుకు నిర్మించారని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఇంత చెప్పినా సమస్య కళ్ళు ఎదుట కనిపిస్తున్నా పట్టించుకోవట్లేదు అంటే …ప్రతిపక్ష సభ్యులు చెప్తున్నారని నామోషీనా? లేక అధికార మదమా? అని గిరజాల తీవ్రంగా విమర్శిస్తున్నారు. వీటిని వెంటనే నీళ్లతో నింపాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక నాయకులు కుసునూరి బాబులు, దామిశెట్టి అశోక్ మంగువర ప్రసాద్ ఆయన వెంట ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page