
Gas Shortage : త్రినేత్రం న్యూస్ : Mar 20, 2026, ఎల్‌పీజీ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టిందని, ఒక్కరోజే 6 వేల చోట్ల దాడులు నిర్వహించారు. తెలంగాణ కూడా 1000 ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీల్లో సోదాలు జరిగాయని తెలిపింది. ప్రత్యామ్నాయంగా PNG కనెక్షన్లు వినియోగించాలని సూచిస్తూ, అవసరమైతే బొగ్గు, కిరోసిన్ పొయ్యిలు ఉపయోగించాలని తెలిపింది. రాష్ట్రాలు బొగ్గు నిల్వలు పెంచాలని ఆదేశించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

