K.V. Puram Mandal Flooded : కలత్తూరులో జల ప్రళయం.. కె.వి పురం మండలంలోని రాయల చెరువుకు గండి..

TRINETHRAM NEWS

తేదీ:06-11-2025 కలత్తూరు,కే.వి.బి పురం.. కె.వి పురం మండలం కలత్తూరు గ్రామంలో ఉదయం 7 గంటలకు భారీ జలప్రళయం చోటుచేసుకుంది. కలత్తూరు గ్రామం హరిజనవాడ పూర్తిగ నీట మునిగి భారీ మొత్తంలో ఆస్తి నష్టం జీవ నష్టం నెలకొంది. ప్రజలు అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి జిల్లాకే.వి.బి పురం మండలంలోని ఓలూరు గ్రామం రాయల చెరువుకు గురువారం ఉదయం ఏడు గంటలకు గండిపడటంతో నీటి ప్రవాహం లోతట్టు ప్రాంతాలలోని గ్రామాలపై ప్రవహించింది.

ఈ ప్రవాహం సుమారు 15 అడుగుల ఎత్తున ప్రవహించింది. కలత్తూరు గ్రామంలోని హరిజనవాడ నీట మునిగింది.ఈ ప్రవాహ ఎద్దడితో భారీ ఆస్తినష్టం,జీవనస్టం ఏర్పడింది. ప్రవాహ వేగానికి హరిజనవాడలోని ఇళ్ళలోని సామాన్లు,అలాగే ద్విచక్ర వాహనాలు,వారి జీవాధారమైన ఆవులు పశువులు కొట్టుకుపోయాయి. రాయల చెరువు గండిపడటం స్థానికులకు ముందస్తుగా తెలియడంతో అప్రమత్తం కావడంతో ఎలాంటి మానవ ప్రాణ నష్టం వాటిల్ల లేదు.ఈ ప్రళయం ఉదయం7 నుంచి 10 వరకు సుమారు మూడు గంటల పాటు కొనసాగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rayala Lake in K.V. Puram Mandal flooded..

You cannot copy content of this page

Scroll to Top