NHM సిబ్బందికి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలి

TRINETHRAM NEWS

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్

ఆసిఫాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. NHM లో పనిచేయుచున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రావాల్సిన 2 నెలల వేతనాలు అనగా సెప్టెంబర్, అక్టోబర్ – 2025 7 నెలల పిఆర్, ఏరియర్స్ తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు.గురువారం రోజున కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డీమహో కార్యాలయంలో ఆఫీస్ సుపడట్ సఫియోద్దీన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ లేని గత రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు పస్తులు ఉంటూ కుటుంబాన్ని పోషించు కోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ప్రభుత్వ ఉద్యోగుల లాగానే వీరికి కూడా ప్రతినెలా ఒకటవ తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈనెల ఈ నెల 17 నవంబర్ 2025 సోమవారం రోజున ఉదయం 11 గంటలకు NHM కమీషనర్ కార్యాలయం హైదరాబాద్, కోరి వద్ద మహాధర్నా విషయం గురించి !

పై విషయానుసారం తమరికి తెలియజేయునది ఏమనగా NHM స్కీంలో దాదాపు 78 క్యాడర్లలో సుమారు 17,541 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో గత అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగులు నిత్యం క్రింది స్థాయి ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ అనేక ప్రాంతాల నుండి విధులకు హాజరవుతుంటారు.

కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరు పేద, మధ్య తరగతి చెందినవారు. ప్రతి నెలా 1వ తేదీన జీతం అందితే తప్ప వారి కుటుంబాలు నడవని పరిస్థితి లేదు. గత సెప్టెంబర్, అక్టోబర్-2025 (2 నెలల) జీతాలు అందకపోవటంతో కార్మికుల పరిస్థితి దయానీయంగా ఉన్నది. ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు, కుటుంబ పోషణ కష్టంగా ఉన్నది. ఇట్టి విషయమై గతంలో అనేక సందర్భాలు తమరికి జిల్లా స్థాయి అధికారులకు వినతులు ఇవ్వటం జరిగింది. కాని నేటి వరకు కూడా జీతాలు అందలేదు.

కావున పై సమస్యలు పరిష్కరించని కారణంగా గతంలో ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసిన ఫలితము రానందున ఈ నెల 17 నవంబర్ 2025 తేదీన NHM డైరెక్టరేట్ కార్యాలయం ముందట ఉదయం 11 గంటలకు మహాధర్నా నిర్వహించాలని మా యూనియన్ నిర్ణయించింది. కావున సహృదయముతో అలకించి మా సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోగలరని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి దివాకర్ ఉపాధ్యక్షులు ఆత్మకూరు చిరంజీవి కోశాధికారి నగేష్ సహాయ కార్యదర్శి రాందాస్,ఎన్హెచ్ఎం సిబ్బంది శ్రీదేవీ, ప్రకాష్,శ్రీకాంత్,విజయసాగర్, భవాని, సమత తోపాటు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

NHM staff should be paid pending salaries immediately

You cannot copy content of this page

Scroll to Top