Fertilizer App : ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల సరఫరా

TRINETHRAM NEWS

ఏ ఓ రెహానా.

డిండి(గుండ్లపల్లి) డిసెంబర్ 20 త్రినేత్రం న్యూస్. రైతులకు పారదర్శకంగా ఎరువులు అందించేందుకు వ్యవసాయ శాఖ రూపొందించిన యూరియా సప్లై యాప్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో రెహనా కోరారు .

రైతులు ఎరువుల దుకాణాలు మరియు పరపతి సంఘాల వద్ద బారులు తీరకుండా యాప్ ద్వారా ఇంటి నుంచే యూరియా కొనుగోలు చేసే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందనీ తెలిపారు.ఎరువుల అమ్మకంలో ప్రవేశపెట్టబోతున్న నూతన విధానంపై వ్యవసాయ శాఖ అధికారులకు, అధికృత ఎరువులు వ్యాపారులకు గత రెండు రోజులుగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు నుంచి ఈ విధానం అందుబాటులోకి వస్తుంది, ఎరువుల విక్రయాలు ఈ యాప్ ద్వారానే జరగనున్నాయి. మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా సరఫరా చేయవలసి ఉంటుందనీ. రైతు యొక్క సాగు విస్తీర్ణం, సాగు చేసే పంట ఆధారంగా ఎరువుల సరఫరా ఉంటుందనీ తెలిపారు..

రైతులు యాప్ లో తమకు సౌకర్యంగా ఉన్న అధికృత డీలర్ లేదా సహకార సంఘాన్ని ఎంపిక చేసుకోవచ్చు. యూరియాని బుక్ చేసుకున్న తర్వాత బుకింగ్ ఐడి వస్తుంది. ఐడితోపాటు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ తీసుకొని ఎంపిక చేసుకున్న డీలర్ లేదా సహకార సంఘం దగ్గరకు వెళ్లి యూరియా తీసుకోవచ్చు. – ఈ యాప్ ద్వారా యూరియా సరఫరా 4 విడుతలుగా విభజించబడింది. ఎకరం ఉన్న రైతుకు ఒకే విడతలో యూరియా అందుతుంది. 1-5 ఎకరాలు ఉన్నవారికి రెండు విడతల్లో అందుతుంది. 5-20 ఎకరాలకు మూడు విడతల్లో మరియు >20 ఎకరాలకు నాలుగు విడతల్లో ఎరువుల సరఫరా ఉంటుంది. చరవాణిలోని ప్లే స్టోర్ నుంచి ‘ఫర్టిలైజర్ యాప్’ ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లో సంబంధిత రైతు పట్టాదారు పాసుపుస్తకం సంఖ్యను నమోదు చేయగానే ఆధార్ కు లింక్ చేసిన నంబర్ కు ఓటిపి వస్తుంది. దీనిని నమోదు చేయగానే రైతు భూవిస్తీర్ణం సాగు చేసిన పంటల వివరాల ఆధారంగా ఎన్ని బస్తాల యూరియా లభ్యమవుతుందో కనిపిస్తుంది. రైతు తమకు కావలసిన డీలర్ దగ్గర నుంచి ఎరువుల బస్తాలను బుక్ చేసుకోవచ్చు.యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవడంలో ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ శాఖను సంప్రదించవచ్చనీ ఏ ఓ రెహానా తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fertilizer supply through Fertilizer App

You cannot copy content of this page

Scroll to Top