Jagan launched the App. : యాప్ ను లాంచ్ చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్

TRINETHRAM NEWS

తేదీ : 24/09/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); తాడేపల్లి మండలం, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ వైసిపి విస్తృతస్థాయి సమావేశంలో కొత్త యాప్ ను లాంచ్ చేశారు. ఈ యాప్ కు డిజిటల్ బుక్ అనే పేరును పెట్టారు. అన్యాయానికి గురవుతున్న వైసిపి కార్యకర్తల కోసం తీసుకొచ్చామని జగన్ వెల్లడించారు. అక్రమ కేసులు అధికార పార్టీ నాయకుల వేధింపులు, స్థానిక సమస్యలను ఈ యాప్ ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అయితే ఇటివలే రెడ్ బుక్ తరహాలోనే డిజిటల్ యాప్ ను తీసుకొస్తామని ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పై ఉట్టిగే కేసులు పెట్టడం లేదని, చేసిన అక్రమాలకు, దౌర్జన్యాలకు కేసులు పెడుతున్నారని ప్రజల్లో మాట అనిపిస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jagan launched the app.

You cannot copy content of this page

Scroll to Top