మూడు నెలలుగా జీతాలు లేక పారిశుధ్య కార్మికులు అర్దకాలి ..తాటిపాక మధు
తక్షణమే వేతనాలు మంజూరు చేయాలని కార్మికులు ధర్నా
త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం, జనవరి, 05: ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం రాజమండ్రి కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన చేపట్టారు
దీనికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయ ప్రకారం తెలుగు పండగలలో అతిపెద్ద పండుగలు భోగి,సంక్రాంతి. పండగ పూట పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు పస్తులుండే పరిస్థితి. కార్మికులు పండగ చేసుకునేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయి జీతాలు సంక్రాంతి లోపు మంజూరు చేయాలని ఆయన అన్నారు.
ఈ పండగలకు చంద్రన్న కానుకలు కరువయ్యాయని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కొత్త బట్టలు, చెప్పులు, కొబ్బరినూనె ఇతర ఇతర సామాగ్రి అందించే ఆనవాయితీ కరువైందని, తక్షణమే అందించాలని ఆయన అన్నారు. సంక్రాంతి లోపు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు మంజూరు చేయకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని ఆయన అన్నారు.
ఆప్కాస్ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు 60 సంవత్సరాలు పూర్తికాగానే ఇంటికి పంపుతున్నారని నియ విధమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింప చేయడం లేదని, వారి కుటుంబీకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పర్మినెంట్ ఉద్యోగులకు ఇస్తున్న రాయితీలు అన్ని వర్తింపచేయాలనే ఆయన అన్నారు.
రిటైర్మెంట్ అయినా, మృతి చెందిన వారి స్థానంలో సిబ్బంది నియమించలేకపోవడంతో ఆ పని భారం ఇతర కార్మికులపై పడుతుందని, పెరుగుతున్న జనాభాగా అనుగుణంగా సిబ్బందిని పెంచాలని, పనిముట్లు కొరత తీర్చాలని ఆయన అన్నారు. మరణించిన కార్మిక కుటుంబాలకు తక్షణమే ఉద్యగాలు ఇవ్వాలని ఆయన అన్నారు మున్సిపల్ కార్మికులు కు కార్యాలయం కు స్థలం కేటాయించాలని ఆయన కోరారు .
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రెడ్డి రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ధనాల దుర్గమ్మ, యానిమేటర్లు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె కనక, అధికార బాడీ నాయకులు బంగారు గిరి, గూడుపు గిరి, వెంకటలక్ష్మి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


