
మద్యం తాగి గొడవపడుతున్నాడనే కోపంతో హత్య.. పోలీసుల విచారణలో వెలుగులోకి నిజాలు
Wife Burns Husband : త్రినేత్రం న్యూస్ : సంగారెడ్డి జిల్లా : భర్త వేధింపులు భరించలేకపోతున్నాననే కోపంతో ఓ భార్య దారుణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. భర్తను పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసి, విద్యుత్ షాక్‌తో చనిపోయినట్లు నమ్మించేందుకు నాటకమాడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
కంగ్టి మండలం దెగుల్వాడిలో ఈ నెల 10న జరప్ప (46) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత విద్యుత్ షాక్‌తో మరణించినట్లు భావించినప్పటికీ, పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తపై భార్య బుజ్జమ్మ పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం బెడ్‌పై విద్యుత్ వైర్లు ఉంచి కరెంట్ షాక్‌తో భర్త చనిపోయినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.
రోజూ మద్యం తాగి వచ్చి గొడవపడుతున్నాడనే కోపంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు బుజ్జమ్మ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు బుజ్జమ్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కరెంట్ షాక్ మరణంగా చిత్రీకరించాలనుకున్న ఘటన.. పోలీసుల దర్యాప్తుతో హత్యగా వెలుగులోకి వచ్చింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe